పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఎలా కాల్చాడో చూడండి... (Video)

సోమవారం, 31 జులై 2017 (12:31 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వ్యాపారవేత్తను ఓ వ్యక్తి నిర్ధాక్షిణ్యంగా కాల్చిపారేశాడు. అదీకూడా పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గురి పెట్టి గ‌న్‌తో కాల్చి హత్య చేశాడు. ఈఘ‌ట‌న పంజాబ్‌లోని ఫ‌రిద్ కోట్‌లో జ‌రిగింది. 
 
హత్యకు గురైన వ్యాపారవేత్త ర‌వింద్ర ప‌ప్పు కొచ్చర్‌గా గుర్తించారు. ప‌ప్పు కొచ‌ర్ మిల్ బ‌య‌ట ఆయ‌న కారులో ఉండ‌గానే పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపేశాడు. అయితే.. హత్య‌కు గ‌ల కార‌ణాలు మాత్రం ఇంకా తెలియ‌లేదు. కొచ‌ర్‌ను హ‌త్య చేసిన వ్య‌క్తి ఫ‌రిద్ కోట్ జిల్లా జైటో టౌన్‌కు చెందిన లోక‌ల్ గ్యాంగ్ మెంబ‌ర్ అయి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి