కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి పరిషోత్తం రూపాల పేర్కొన్నారు. రైతులతో చర్చలు కొనసాగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అయితే, ఇప్పటివరకు జరిగిన చర్చల్లో ఏమాత్రం పురోగతి కనిపించకపోవడంపై ఆయన పెదవి విరిచారు.
రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసిన రోజునే తాము లోహ్రీ (భోగి) పండుగను జరుపుకుంటామని రైతులు స్పష్టం చేశారు. కాగా, ఈ నెల 26న వేలాది ట్రాక్టర్లతో ఢిల్లీ శివారులో పరేడ్ నిర్వహించనున్నట్టు ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ప్రకటించింది.
మరోవైపు, రైతుల కష్టాలను చూసి చలించిన సుప్రీంకోర్టు ఈ సాగు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించేవరకు వీటిని అమలు చేయడానికి వీల్లేదని పేర్కొంది. అదేసమయంలో సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేశారు.