దీనిపై కేంద్రం మరోసారి వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇంకా సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరపడంపై అభ్యంతరం తెలిపింది. కొత్త సామాజిక సంబంధాల అంశాలపై కేవలం పార్లమెంట్ మాత్రమే నిర్ణయం తీసుకోగలదని పేర్కొంది. దీనిపై చీఫ్ జస్టిస్ డి.వై చంద్రచూడ్ స్పందిస్తూ.. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కోర్టుకు చెప్పనవరసం లేదని.. తాము మొదట పిటిషినర్ల వాదనలు వింటామని స్పష్టం చేశారు.