జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి, ఉన్నావో ఘటనలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో.. కేంద్రంలో కదలిక వచ్చింది. దేశవ్యాప్తంగా చిన్నారులపై అఘాయిత్యాలు, దారుణ ఘటనలు పెరిగిపోతుడటంతో కఠిన చట్టాలు తెచ్చేందుకు కేంద్రం నడుం బిగించింది.
ఇందులో భాగంగా 12ఏళ్లలోపు వయస్సున్న చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించేలా చట్టానిరి సవరణలు చేసే ప్ర్రక్రియను ప్రారంభించినట్లు సర్కారు తెలిపింది. ఓ ప్రజాహిత వ్యాజ్యంపై విచారణలో భాగంగా సుప్రీం కోర్టుకు కేంద్ర సర్కారు తాను తీసుకుంటున్న చర్యల గురించి లేఖ రూపంలో వివరించింది. 12 ఏళ్లలోపు వారిపై అత్యాచారానికి పాల్పడిన వారికి గరిష్టంగా ఉరిశిక్ష విధించేలా పోస్కో చట్టాన్ని సవరిస్తున్నట్లు తెలిపింది.