చెరువులోకి దూసుకెళ్ళిన కారు.. 8 మంది మృత్యువాత

ఠాగూర్

ఆదివారం, 3 నవంబరు 2024 (11:50 IST)
అతివేగం ఎనిమిది మంది ప్రాణాలు తీసింది. ఈ విషాదకర ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బలరాంపూర్‌లో జరిగింది. అతివేగంతో వెళుతున్న కారు ఒకటి చెరువులోకి దూసుకెళ్లిందింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. బుధబాగిచా ప్రాంతం నుంచి సూరజ్ పూర్ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు, పోలీసు సిబ్బంది సహాయంతో చెరువులో ఉన్న కారును బయటకు తీశారు. ఆ వాహనంలో ఉన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

అక్కాబావా అంటూ ఆప్యాయంగా పలుకరించి చిన్నారిని చిదిమేసిన కామాంధుడు... 
 
ఎలాంటి బంధుత్వం లేకపోయినప్పటికీ అక్కాబావా అంటూ ఆప్యాయంగా పలుకరిస్తూ ఇంటికి వచ్చిపోతుండేవాడు. చివరకు ఆ కామాంధుడే ఆ దంపతులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మూడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హతమార్చి మృతదేహాన్ని పాతిపెట్టాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని కేబీపురానికి చెందిన దంపతులకు మూడేళ్ళ కుమార్తె, యేడాదిన్నర కుమారుడు ఉన్నాడు. వీరిద్దరూ స్వగ్రామంలో పనులు లేకపోవడంతో పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం వడమాలపేట మండలంలోని అత్తారింటికి వచ్చారు. కొన్నాళ్లుగా అక్కడే కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చారు. వీరి ఇంటికి సమీపంలోనే ఉంటున్న సుశాంత్ అలియాస్ నాగరాజు (23)కు తల్లిదండ్రులు లేరు. పెద్దనాన్న చెంచయ్య వద్ద పెరుగుతున్నాడు. ఈ క్రమంలో అనేక చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో ఇంటి నుంచి గెంటేయడంతో చెంచయ్య కుమారుడు వెంకటేష్ వద్ద ఉండసాగాడు. 
 
ఈ క్రమంలో ప్రతి ఒక్కరినీ వరుసలు కలుపుతూ పిలిచేవాడు. శుక్రవారం మధ్యాహ్నం మద్యం సేవించిన నాగరాజు.. పాపకు చాక్లెట్లు కొనిస్తానని తల్లికి చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. ఆ తర్వాత కుమార్తె ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో అతడిని నిలదీయడంతో తనకు తెలియదని బుకాయించాడు. దీంతో ఆందోళన చెందుతూ ఊరంతా వెతికినా ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. 
 
చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసి ఆ తర్వాత శవాన్ని పాఠశాల ఆట స్థలం వద్ద పక్కనే ఉన్న వంకలో పాతిపెట్టినట్టు చెప్పాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, హత్యకుగురైన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. హోం మంత్రి అనిత ఆదివారం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి సాయం అందించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు