కారు లోయలో పడి 8మంది మృతి చెందిన సంఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి కారు వేగంగా వస్తూ అదుపుతప్పి లోయలో పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని మొహభత్తా పట్టణ సమీపంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఓ కుటుంబానికి చెందిన 8 మంది ప్రయాణికులు కారులో వేగంగా వెళుతుండగా మొహభత్తా పట్టణ సమీపంలోని లోయలో పడిపోయింది.
ఈ ప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు, ఓ బాలుడు అక్కడికక్కడే మరణించారు. లోయలో నుంచి మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చామని జిల్లా ఎస్పీ ప్రశాంత్ ఠాకూర్ చెప్పారు.