రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరిన నేపథ్యంలో ప్రధాని గారు సానుకూలంగా స్పందించారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది.
కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు సహా వివిధ అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎం... ప్రధానికి ఓ నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులపై వారు చర్చించారు.