అలాగే, జనవరి నుంచి మార్చి మధ్య ఆరు కోట్ల కరోనా వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేశారని, దీంతో దేశంలో వాటి కొరత ఏర్పడిందని అన్నారు. విదేశాలకు వాటిని ఎగుమతి చేయకపోతే దేశంలో మరి కొన్ని కోట్ల మంది భారతీయులకు వ్యాక్సిన్లు అందేవని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆమె ప్రశ్నించారు.
ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీల్లో నవ్వుతూ మాట్లాడటం కాదని, ప్రజల ముందుకు వచ్చి, వారి ముందు కూర్చుని మాట్లాడాలని, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో వారి ప్రాణాలను ఎలా కాపాడతారో వారితో చర్చించి నమ్మకం కల్పించాలని ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు.