దేశంలో కరోనా ఉధృతి

మంగళవారం, 30 మార్చి 2021 (10:16 IST)
దేశంలో కరోనా ఉధృతి రోజురోజుకీ తీవ్రమౌతోంది. తాజాగా ఆదివారం నుండి సోమవారం వరకు 24 గంటల వ్యవధిలో దేశ వ్మాప్తంగా 68,028 మందికి వైరస్‌ సోకగా, 291 మంది మరణించారు. తాజాగా వైరస్‌బారిన పడిన వారిలో ఒక్క మహారాష్ట్ర నండే 40,414 మంది ఉన్నారు.

తాజా సమాచారంతో దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 1,20,39,644కు, మర ణాల సంఖ్య 1,61,843కు చేరింది. ఈ మేరకు కేంద్ర వ్యైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో కోవిడ్‌ బారి నుంచి 32,231 మంది బాధితులు కోలుకున్నారని, దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 1,13,55,993 కి చేరిందని తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,21,808 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.
 
మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలలో అప్రమత్తమయిన అధికారులు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.

మహరాష్ట్రలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరు గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో చోటుచేసుకున్న మరణాల్లో 81.73 శాతం మహారాష్ట్రలో చోటుచేసుకున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు