ముఖ్యంగా ఢిల్లీలో 10 మంది సుప్రీంకోర్టు జడ్జిలకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. జడ్జీలకు కరోనా కారణంగా మూడు కోర్టుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దగ్గుతో బాధపడుతున్నారు. సుప్రీంకోర్టులో ఈరోజు ఒక కేసు విచారణ సంధర్భంగా దగ్గుతో బాధపడుతున్న విషయాన్ని వెల్లడించారు ఎన్.వి.రమణ.
తాను కూడా దగ్గుతో బాధపడుతున్నానని.. తక్షణం చేపట్టలేమని వచ్చేవారం విచారిస్తామని జస్టిస్ ఎన్.వి.రమణ స్పష్టం చేశారు. జడ్జిలందరికీ ఈ కోవిడ్ సోకడం ప్రస్తుతం తీవ్ర చర్చకు కారణమవుతోంది. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేస్తున్నా ప్రజలు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కోవిడ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది.