దేశంలో కరోనా వైరస్ భారీగా వ్యాపిస్తోంది. గతవారం రోజులుగా దేశంలో నిత్యం ఆరు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం ఒక్కరోజే కొత్తగా 6566 కేసులు, 194 మరణాలు సంభవించాయి. దేశంలో ఒకేరోజు 194 మంది మృత్యువాతపడటం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. గురువారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,58,333కి చేరింది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదు అయిన కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,58,333గా ఉంది. దీంట్లో 86110 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 67692 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 4531కి చేరుకున్నది.
అలాగే మహారాష్ట్రలో వైరస్ తీవ్రత ఆందోళనకరస్థాయిలో ఉండగా తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో రోజురోజుకు ఈ మహమ్మారి తీవ్రత పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ పదవ స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.