దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,387 మందికి కొత్తగా వైరస్ కేసులు నమోదైనాయి. గడిచిన ఆరు రోజులతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,387 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో 170 మంది కరోనా బారినపడి మృతిచెందారు.
దీంతో.. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,51,767కి చేరింది. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 4,337కు పెరిగింది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన చెందుతున్నారు.