దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 5,242 కేసులు నమోదవగా, 157 మంది మృతిచెందారు. దీంతో దేశంలో కరోనా పాటిజివ్ కేసుల సంఖ్య 96,169కి పెరిగింది. దీంతో భారత్‌లో కరోనా కేసులు లక్షకు దగ్గరలో ఉన్నాయి.
ఇక ఆదివారం ఒక్కరోజులేనే కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఈ ప్రాణాంతక వైరస్ వల్ల ఇప్పటివరకు 3029 మంది బాధితులు మరణించారు. దేశంలో ప్రస్తుతం 56,316 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 36,823 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 33,053 పాజిటివ్ కేసులు నమోదవగా, 1198 మంది మరణించారు. గుజరాత్‌లో 11,379 కరోనా పాజిటివ్ కేసులు నమోదగా, 659 మంది మృతిచెందారు.
తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 11,224కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 78 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో 10,054 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు 160 మంది మృతిచెందారు.