అయితే, కరోనా వేళ జరిగిన ఈ పెళ్లిలో కరోనా మార్గదర్శకాల అమలు ఎక్కడా కనిపించలేదు. విమానంలో అతిథులు కిక్కిరిసి ఉండగా, వధూవరులకు మాస్కుల్లేకుండానే మాంగల్యధారణ జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది.
అలాగే, ఆ విమానంలోని స్పైస్ జెట్ సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. నిబంధనలు పాటించకుండా విమానం ఎక్కిన పెళ్లి బృందంపై ఫిర్యాదు చేయాలంటూ స్పైస్ జెట్‌ను డీజీసీఏ ఆదేశించింది. ఈ స్పైస్ జెట్ చేసే ఫిర్యాదు ఆధారంగా డీజీసీఏ చర్యలు తీసుకోనుంది.