కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్ అయ్యాడు. నటి పవిత్ర గౌడకు చెందిన అభ్యంతరకరమైన సందేశాలు పంపినందుకు రేణుకా స్వామిని కొందరు హత్య చేశారు. నటుడు దర్శన్ సూచనల మేరకు ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. కన్నడ ఇండస్ట్రీలో ఈ హత్య పెద్ద దుమారాన్నే రేపింది. హత్యకు కారణమైన నటుడు దర్శన్‌ని మైసూర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో పోలీసులు అరెస్టు చేశారు. దర్శన్‌తో పవిత్ర గౌడ సన్నిహితంగా ఉంటుంది.