అత్యాచారం చేయబోయాడని తండ్రిని కర్రతో కొట్టిచంపేసిన కుమార్తె.. టీచరైనా?

మంగళవారం, 3 జనవరి 2017 (17:04 IST)
దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికలపై అమానుషంగా కామాంధులు విరుచుకుపడుతున్నారు. వావి వరుసలు లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తెచ్చేదిశగా రంగం సిద్ధం చేస్తోంది. అయినప్పటికీ బాలికలపై, మహిళలపై కామాంధుల దుశ్చర్యలు మితిమీరిపోతున్నాయి.
 
తాజాగా.. అత్యాచారం చేయబోయిన తండ్రిని ఓ బాలిక కర్రతో కొట్టి హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ బారెల్లీకి చెందిన 45 ఏళ్ళ సోంపాల్ టీచర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న 14 ఏళ్ళ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడేందుకు ఉపక్రమించాడు. ఇందుకు కుమార్తె ప్రతిఘటించింది. అంతేకాకుండా కర్రతో తండ్రిని చనిపోయేంత వరకు కొట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను అదుపులోకి తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి