గుజరాత్‌: పొటాటో చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప!

సెల్వి

బుధవారం, 19 జూన్ 2024 (19:14 IST)
Frog
ఆహార పదార్థాల్లో కల్తీ ఎక్కువవుతుంది. తాజాగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని పుష్కర్‌ధామ్ సొసైటీ నివాసితులను ఆందోళనకు గురిచేసే షాకింగ్ సంఘటన జరిగింది. చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప కనబడింది. 
 
పుష్కరధామ్ సొసైటీలోని నివాసముంటున్న జస్మీత్ పటేల్ చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేశారు. సగం తిన్నాక.. జస్మీత్ కూతురు ప్యాకెట్ తెరిచి చూడగా లోపల చనిపోయిన కప్ప కనిపించడంతో నివ్వెరపోయింది. జామ్‌నగర్ మునిసిపల్ కార్పోరేషన్ ఫుడ్ బ్రాంచ్‌‌కు జస్మీత్ పటేల్ ఈ విషయాన్ని తెలియజేశాడు. 
 
వెంటనే స్పందించిన ఫుడ్ బ్రాంచ్ అధికారులు పటేల్ ఇంటికి వెళ్లి ప్యాకెట్‌ను పరిశీలించారు. చనిపోయిన కప్ప చిప్స్ ప్యాకెట్‌లో వుందని నిర్ధారించుకున్న తర్వాత.. ఆ ప్యాకెట్‌ను పరీక్ష కోసం తీసుకెళ్లారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 
 
ఇకపోతే.. సంబంధిత వేఫర్స్ డిస్ట్రిబ్యూటర్, కస్టమర్ కేర్ సర్వీస్‌కు ఫిర్యాదు చేయగా సంతృప్తికరమైన సమాధానం రాలేదని, దీంతో బుధవారం ఉదయం ఫుడ్ సేఫ్టీ అధికారికి సమాచారం అందించానని పటేల్ వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు