ఢిల్లీలో సీఏఏకి వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లలో ఇంటెలిజెన్స్ బ్యూరో శాఖలో పనిచేస్తున్న ఆఫీసర్ డ్రైనేజిలో శవమై తేలాడు. సీఏఏ అల్లర్లు ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన సంగతి తెలిసిందే. అల్లర్ల నేపధ్యంలో అంకిత్ శర్మ అనే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కనిపించకుండా పోవడంతో ఆయన కోసం గాలింపు చేపట్టగా డ్రైనేజీలో ఆయన శవం లభ్యమైంది.
ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన హింసలో ఇప్పటి వరకూ 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో జనం గాయపడటమే కాకుండా పోలీసులు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. ఢిల్లీ అల్లర్లపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైన్యాన్ని రంగంలోకి దించాలని కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షాను కోరారు.