డేరా సచ్చా సౌధాలో సకలభోగాలు అనుభవిస్తూ అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన గుర్మీత్ ఇపుడు దిన కూలీగా మారారు. జైలులో 8 గంటలు పనిచేస్తున్నాడు. జైలుశిక్ష కాలంలో కూరగాయల మొక్కలు పెంచుతూ, చెట్ల కొమ్మలను కత్తిరిస్తున్నాడు. జైలులో గుర్మీత్ గది పక్కనే కొంత ఖాళీ స్థలం ఉందనీ, అందులో కూరగాయలు పండిస్తున్నాడని హర్యానా జైళ్ల శాఖ డీజీపీ వెల్లడించారు.
పైగా, గుర్మీత్ జైలులో ఎంతో క్రమశిక్షణతో మెలుగుతున్నాడనీ, ఆయనకు జైలులో ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదనీ, ఇందుకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని డీజీపీ వివరణ ఇచ్చారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా గుర్మీత్‌కు ఇతర ఖైదీలతో సంబంధం లేకుండా ఆయన గదిని కొంతదూరంగా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.