ఐఏఎస్ మాజీ ప్రొబెషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్ తండ్రి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ కూడా వివాదాస్పదమైంది. తప్పుడు ధృవపత్రాలను సమర్పించి సివిల్స్ ఎంపిక ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసిన విషయం తెల్సిందే.
అయితే, ఈ సందర్భంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ వివాదాస్పదమైంది. తాను భార్య నుంచి విడాకులు తీసుకున్నట్టు పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన నామినేషన్ వేయగా, అపుడు తాను భార్యతో కలిసే ఉంటున్నట్టు పేర్కొనగా, ఇపుడు మాత్రం విడాకులు తీసుకున్నట్టు పేర్కొనడంతో అఫిడవిట్ వివాదాస్పదమైంది.