దేశంలో బాల్య వివాహాల నిరోధకానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రూపొందించింది. బాల్య వివాహాలు నిరోధక చట్టం అమలుకు వ్యక్తిగత చట్టాలు అడ్డంకి కారాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు మనోజ్ మిశ్రా, జేబీ పార్థీవాలాలతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీచేసింది. బాల్యంలో వివాహం చేస్తే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను హరించినట్టేనని ధర్మాసనం పేర్కొంది.
ఈ సందర్భంగా బాల్యంలో పెళ్లి చేస్తే, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను హరించినట్లే అవుతుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. బాల్య వివాహాలు, మైనర్ల రక్షణపై అధికారులు దృష్టి సారించాలని సూచించింది. నేరస్థులకు జరిమానా విధించాలని తెలిపింది. వ్యక్తిగత చట్టాలతో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అడ్డుకోవద్దని అభిప్రాయపడింది.