ఢిల్లీ నగరంలో ఒక్క రాత్రికే గాలి కాలుష్యం 42 శాతం పెరిగిపోవడంతో సోమవారం ఉదయాన్నే తమ కార్యాలయాలకు వెళ్లాల్సిన ప్రజలకు కాలుష్యంతో కూడిన పొగమంచు దుప్పటిలా కప్పబడటం వల్ల రోడ్లపై వచ్చే వారు కూడా సరిగా కనిపించలేదు. పశ్చిమ ఢిల్లీలో గాలి కలుషితమై ఆందోళనకరంగా మారింది. ఇదే కాలుష్యం మరో మూడు రోజులు కొనసాగితే, పాఠశాలలు, కార్యాలయాలు మూతపడతాయి.
దేశరాజధానిలోనే కాలుష్యం స్థాయి ఇంతగా పెరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ గణాంకాల ప్రకారం ఆర్కేపురం వద్ద గాలిలో కాలుష్యం సాధారణం కంటే 42 రెట్లు పెరిగింది. ప్రపంచ అతి పెద్ద నగరాల్లో ఒకటైన ఢిల్లీని సోమవారం కాలుష్యం దుప్పటిలా కప్పిందని పలువురు ఢిల్లీ వాసులు ట్విట్టర్‌లో పెట్టారు.