వైద్య పరీక్షల కోసం జైలు నుంచి ఆస్పత్రికి వెళ్లిన కొందరు ఖైదీలు.. తమకు ఎస్కాట్‌గా పోలీసులకు లంచమిచ్చి.. తమ భార్యలు, ప్రియురాళ్లతో ఏకాంతంగా గడిపిన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. పోలీసుల అనుమతితో వెళ్లిన ఖైదీలు.. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో విచారణ జరుపగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
జైపూర్ సెంట్రల్ జైలు నుంచి శనివారం రఫీక్ బక్రి, భన్వర్ లాల్, అంకిత్ బన్సాల్, కరణ్ గుప్తా అనే నలుగురు ఖైదీలను కానిస్టేబుళ్లు వైద్య పరీక్షల కోసం బయటకు తీసుకెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఖైదీలు గార్డులకు ఒక్కొక్కరికీ రూ.5 వేలు చొప్పున లంచం ఇస్తామని, తమను సాయంత్రం వరకు బయట వదిలేయాల్సిందిగా కోరారు. దీనికి అంగీకరించిన కానిస్టేబుళ్లు వారిని వదిలివేశారు. బయటకు వెళ్లిన ఖైదీలు సాయంత్రమైన తిరిగి రాకపోవడంతో అధికారుల వారి కోసం గాలిస్తుండగా, ఓ హోటల్‌లో రఫీక్ తన భార్యతో, భన్వర్ తన మాజీ ప్రియురాలితో ఉన్నట్టు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
మరో ఇద్దరు ఖైదీలైన అంకిత్, కరణ్ విమానాశ్రయానికి సమీపంలోని ఒక హోటల్‌లో ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారుప. కరణ్‌తో పాటు ఉన్న అతడి బంధువు వద్ద అనేక మంది ఖైదీల ఐడీ కార్డులు, రూ.45 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.