పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం రంజుగా మారుతోంది. ఎనిమిది దశల పోలింగ్‌లో భాగంగా ఇప్పటికే అక్కడ మూడు దశలు ముగియగా... మరో ఐదు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార తృణమూల్, బిజెపిలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడంతో పాటు... పోటాపోటీగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.
ముస్లింలు ఓట్లు చీలిపోయేలా వేర్వేరు పార్టీలకు ఓటు వేయవద్దని, గంపగుత్తగా తమ పార్టీకే వేయాలని మమతా ఓటర్లను అభ్యర్థించారని బిజెపి నేత, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి ఇసికి ఫిర్యాదు చేశారు.