నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్

సోమవారం, 9 అక్టోబరు 2023 (10:16 IST)
భారత ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం షెడ్యూల్‌ను వెల్లడించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని నిర్వహించనుంది. భారత ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇతర కమిషనర్లతో కలిసి ఈ షెడ్యూల్‌ను వెల్లడించనున్నారు. 
 
ఈ యేడాది ఆఖరు నాటికి తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సివుంది. ఐదు రాష్ట్రాల్లో నవంబర్‌ మధ్య నుంచి డిసెంబర్‌ తొలి వారంలోపు ఎన్నికలు జరగొచ్చని ఈసీ వర్గాలు గతంలో పేర్కొన్నాయి. 
 
తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్‌ 17నే ముగియనుండగా.. తెలంగాణ, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో వేర్వేరు తేదీల్లో ముగుస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు