ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం జరిగితే... బోగస్ ఓటర్లకు అడ్డుకట్ట వేయవచ్చని, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఓటర్ ఐడీ కార్డులను కలిగి ఉండటాన్ని తగ్గించవచ్చని తన లేఖలో సూచించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950కి కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
కాగా, ఓటర్ కార్డులను ఆధార్ నంబరుతో అనుసంధానించుకోవడం ఓటరు వ్యక్తిగత నిర్ణయమని గతంలో ఈసీ వ్యాఖ్యానించింది. అయితే, 2016లో ఏకే జోటి చీఫ్ ఎలెక్షన్ కమిషనరుగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఈసీ తన అభిప్రాయాన్ని మార్చుకుంది.
ఓటర్ల ఆధార్ వివరాలను తమ డేటా బేస్‌కు లింక్ చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా జులై 2017లో సుప్రీంకోర్టును ఈసీ కోరింది. మరోవైపు, ఇప్పటివరకు 32 కోట్ల మంది తమ ఆధార్‌ను ఓటరు ఐడీ కార్డులతో అనుసంధానం చేసుకున్నారు.
ఇప్పటికే అనేక ప్రభుత్వ పథకాలతో పాటు.. పాన్ కార్డు (పర్మినెంట్ ఖాతా నంబరు)తో ఆధార్ కార్డును అనుసంధానం చేసిన విషయం తెల్సిందే. అంతేకాకుండా, విద్యార్థులకు సంబంధించి అన్ని సర్టిఫికేట్లలోనూ ఆధార్ కార్డును అనుసంధానించారు.