హర్యానా మాజీ ముఖ్యమంత్రి మాంగేరాయ్ రాఠీ కుమారుడు విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు నఫే సింగ్ రాఠీతో సహా ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. 55 సంవత్సరాల జగదీశ్ రాఠీ బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్టు ఝజ్జర్ ఎస్పీ వసీం అక్రమ్ తెలిపారు.
శవపరీక్ష తర్వాత ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే, ఆయన విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రాథమికంగా తెలియవచ్చిందన్నారు. ఆస్తి సంబంధ విషయాల్లో జగదీశ్ వేధింపులు ఎదుర్కొన్నట్టు మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే ఆయన తీవ్ర ఒత్తిడిలో కూరుకుని పోయినట్టు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని జగదీశ్ కూడా ఇటీవల ఓ ఆడియో క్లిప్ ద్వారా వెల్లడించారు.
కాగా, డిసెంబరు 26వ తేదీన ఓ ఆడియో క్లిప్ విడుద చేస్తూ వీరందరూ తనను వేధిస్తున్నారని తనకేమైనా జరిగితే అందుకు వారే బాధ్యులు అవుతారని అందులో ఆరోపించారు. దీంతో పోలీసులు ఆయనను కలిసి ఫిర్యాదు చేయాలని కోరగా అందుకు ఆయన నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.