ఎగ్జిట్ పోల్స్ పేరుతో భారీ కుట్ర.. అప్రమత్తంగా ఉందాం : మమతా బెనర్జీ

సోమవారం, 20 మే 2019 (10:14 IST)
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలన్నీ ఎన్డీయే కూటమికి అనుకూలంగా వచ్చాయి. దీనిపై వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో భారీ కుట్రకు తెరతీశారని ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆమె ఓ ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ పేరుతో భారీ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తాను విశ్వసించబోనన్నారు. ఎగ్జిట్ పోల్స్ మాటున భారీ కుట్ర జరగబోతోందని ఆరోపించారు. ఈ వార్తలకు బాగా ప్రచారం కల్పించి ప్రజలను భ్రమల్లోకి నెట్టేస్తారని, ఆ తర్వాత వేలాది ఈవీఎంలను ఒక చోటి నుంచి మరో చోటుకి తరలించే కుట్ర జరగబోతోందని ఆరోపించారు. అందువల్ల విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై నిలవాలని, మతతత్వ శక్తులను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని మమత పిలుపునిచ్చారు.  
 
కాగా, ఆదివారం సాయంత్రం తుది విడత ఎన్నికల పోలింగ్ ముగియగానే వివిధ చానళ్లన్నీ ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. దాదాపు అన్నీ ఎన్డీయే మరోమారు అధికారంలోకి రాబోతోందని తేల్చి చెప్పాయి. ఎన్డీయేకు 300కు పైగా స్థానాలు వస్తాయని స్పష్టం చేశాయి. ఈ అంచనాలపై స్పందించిన మమత వాటిని నమ్మొద్దని ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ పేరుతో కుట్రకు తెరలేపారని తన ట్వీట్‌లో ఆరోపించారు. అలాగే, విపక్షాలు కూడా ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలను కొట్టిపారేశాయి. ఈ ఫలితాలను తాము విశ్వసించడంలేదని విపక్షనేతలంతా ముక్తకంఠంతో వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు