బీఎస్పీ అధినేత్రి మాయావతిపై భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు దయా శంకర్ సింగ్ మరోమారు రెచ్చిపోయారు. ఆమెను కుక్కతో పోల్చారు. నిజానికి దయా శంకర్ సింగ్ పార్టీ నుంచి ఇప్పటికే బహిష్కరణకు గురైవున్న విషయం తెల్సిందే. గతంలో మాయావతిని వ్యభిచారిణితో పోల్చగా, ఇపుడు కుక్కతో పోల్చారు.