కొబ్బరి చెట్టే చిన్నారి ప్రాణాలు తీసింది.. ఎలాగంటే?

శుక్రవారం, 2 జులై 2021 (14:29 IST)
ఇంటి ముందున్న కొబ్బరి చెట్టే చిన్నారి ప్రాణాలు తీసింది. కర్ణాటకలోని హవేరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనపై చాలా మంది భయబ్రాంతులవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. హవేరి జిల్లాలోని హన్సభవి గ్రామానికి చెందిన మల్లిఖార్జున, మాలా దంపతులు. వీరికి 11 నెలల వయసున్న కొడుకు ఉన్నాడు. ఈ చిన్నారి పేరు తన్విత్ వాల్మీక్. వాల్మీక్‌ను స్నానం చేయించి ఇంటి ముందున్న కొబ్బరి చెట్టు కింద మంచం వేసింది. 
 
వాల్మీక్‌ను మంచం మీద పెట్టి ఇంట్లో పనుల్లో బిజీ అయిపోయింది. మల్లిఖార్జున కూడా పనికి వెళ్లిపోయాడు. అయితే కొబ్బరి చెట్టు కింద ఆడుకుంటున్న వాల్మీక్‌పై కొబ్బరి బోండ పడింది. కొబ్బరి బోండ తలపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది. రక్తం ఏరులై పారింది. బాబు అరుపు విన్న తల్లి పరిగెత్తుకుంటూ వెళ్లింది. రక్తంతో తడిసిన వాల్మీక్‌ను చూసి ఒక్కసారిగా షాకైంది. పక్కనే బోండం కనిపించడంతో.. బోండం వల్లే తలకు గాయమైందని తెలిసి నిర్ఘాంతపోయింది. 
 
పిల్లాడి అరుపు విని స్థానికులు గుమిగూడారు. వెంటనే దావణగెరెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే.. వైద్యం చేస్తుండగానే పిల్లాడు కొన ఊపిరి వదిలేశాడు. దీంతో మాలా, మల్లిఖార్జున గుండెలు పగిలేలా రోదించసాగారు. ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు