పువ్వులతో, పసుపు కుంకుమలతో దీపాన్ని అలంకరించుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న కొబ్బరి దీపాన్ని పంచమి తిథి అయిన సోమవారం (28 జూన్) రాత్రి 8 గంటల నుంచి 9 గంటల్లోపు వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ దీపాన్ని ఆలయాల్లో వెలిగించడం ఉత్తమం.
కానీ కరోనా కాలం కావడంతో ఇంట్లోనే వెలిగించి.. ఆ దీపాన్ని కొబ్బరిని మరుసటి రోజు పారే నీటిలో కలిపేయాలి. ఇలా చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ప్రతికూలతల ప్రభావం వుండదు. సానుకూల శక్తిని పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఇంట తెలుపు ఆవాలు, పచ్చకర్పూరంతో కలిపి ధూపం వేయడం మరువకూడదు. ఆపై పానకం నైవేద్యంగా సమర్పించవచ్చు.
ఇంకా ఐదు నూనెలను కలగలిపి.. ఆమెకు దీపం వెలిగిస్తే సకలసంపదలు వెల్లివిరుస్తాయి. ఈ దీపానికి ఎరుపు వత్తులను వాడటం మంచిది. నైవేద్యంగా పొట్టు తీయని మినపప్పుతో తయారు చేసిన గారెలు లేకుంటే నవధాన్యాలతో చేసిన గారెలను, పెరుగన్నం, శెనగలు, పానకం వంటివి సమర్పించవచ్చు.