మహాభారతంలో కర్ణుడుని తల్లి కుంతీదేవి ఓ పెట్టెలో పెట్టి నదిలో వదిలేసిన ఘటన గురించి తెలిసిందే. అది ఆ కాలం నాటి మాట. కానీ కలియుగంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుందంటే నమ్ముతారా.. నమ్మితీరాల్సిందే. యూపీలో ఓ చంటిబిడ్డను ఓ చెక్కపెట్టెలో పెట్టి గంగానదిలో వదిలేసిన ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ చెక్కపెట్టెలో చంటిబిడ్డతో పాటు కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో కూడా ఉంది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.