పది మంది రైతులకు రూ. 68,000తో విమాన టిక్కెట్లు కొనిచ్చిన రైతు

శనివారం, 30 మే 2020 (23:01 IST)
తన వద్ద పనిచేసే 10 మంది కార్మికులు బీహారులోని తమ సొంత గ్రామానికి వెళ్లేందుకు వీలుగా ఢిల్లీకి చెందిన పప్పన్ సింగ్ అనే పుట్టగొడుగులు పెంచే రైతు ఏకంగా విమాన టిక్కెట్లు కొనిచ్చాడు. 10 మంది కార్మికులు ఢిల్లీ నుండి బీహారుకు చేరుకునేందుకుగాను వారికి విమాన ఖర్చులను అందించాడు.
 
కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్భంగా వలస కార్మికులు బాధలను దృష్టిలో పెట్టుకుని ఈ సహాయాన్ని అందించారు. దీని తన వద్ద పనిచేసే 10 మంది కార్మికులు తమ సొంత ఊరికి చేరుకున్నారు. వీరిలో ఎక్కువమంది వయసు పైబడిన వయోవృద్ధులనీ, అందువల్ల వారికి సాయం చేసినట్లు తెలిపాడు. అతడు చేసిన సాయానికి రైతు కుటుంబాల సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు