సరిహద్దులను ఖాళీ చేస్తున్న రైతులు.. 380 రోజులకు తర్వాత..?

శనివారం, 11 డిశెంబరు 2021 (16:46 IST)
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నవంబరు నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగించిన అన్నదాతలు.. తమ ఉద్యమానికి ముగింపు పలికారు. ప్రభుత్వం ముందు రైతులుంచిన అన్ని డిమాండ్లకు ఆమోదం లభించడంతో ఆందోళన విరమించి, ఇళ్లకు పయనమయ్యారు. 
 
డిసెంబరు 11 తమ నిరసన కార్యక్రమాలను విరమించి, తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటామని రైతు సంఘాలు గురువారం వెల్లడించిన విషయం తెలిసిందే. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 380 రోజుల పాటు కొనసాగాయి.
 
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళను 380 రోజుల పాటు కొనసాగాయి. అయితే ప్రభుత్వం ముందు రైతులుంచిన అన్ని డిమాండ్లకు ఆమోదం లభించడంతో ఆందోళన విరమించి, ఇళ్లకు పయనమయ్యారు. డిసెంబర్ 11న నిరసన కార్య్రమాలను విరమించారు. సాగు చట్టాల రద్దు బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించినా.. మిగతా డిమాండ్ల నెరవేర్చే వరకూ ఆందోళనలు కొనసాగుతాయని రైతులు ప్రకటించారు. 
 
ఉద్యమాన్ని విరమించడంతో సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లోని టెంట్లను రైతులు తొలగిస్తున్నారు. శనివారం సాయంత్రం సరిహద్దుల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించనున్నారు. సాగు చట్టాల విషయంలో కేంద్రం మెడలు వంచిన రైతులు.. విజయంతో సగర్వంగా తలెత్తుకుని స్వస్థలాలకు వెళుతున్నారు.
 
ఆందోళనలను నిలిపివేయాలని నిర్ణయించిన రైతులు.. జనవరి 15న సమీక్షా సమావేశం నిర్వహిస్తామని రైతులు తెలిపారు. ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకోకపోతే, ఆందోళనను పునరుద్ధరిస్తామని హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు