ఆరేళ్ల బాలికను హత్య చేసిన తండ్రి.. ఇడ్లీ పార్శిల్ తీసుకెళ్లి..?

సెల్వి

గురువారం, 21 మార్చి 2024 (10:44 IST)
ఆరేళ్ల బాలికను ఓ తండ్రి హత్య చేసి తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన లాతూర్ నగరంలోని మోతీనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అభయ్ లఖన్ భూతాడ మోతీనగర్‌లోని రాంకాశి భవనంలో అద్దెకు నివసిస్తున్నాడు. మృతుడు అభయ్ భూతాడ ఇంటి సమీపంలో అల్పాహార కేంద్రం దుకాణం ఉంది. 
 
ఉదయం కూతురిని స్కూల్‌లో దింపేందుకు దుకాణం నుంచి ఇంటికి వెళ్లాడు. దారిలో కూతురికి ఇడ్లీ పార్శిల్ కూడా తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చిన తర్వాత బాలిక గొంతుకోసి హత్య చేశాడు. అతను తన కుమార్తె నౌవ్య అభయ్ భుత్డా (6 సంవత్సరాల వయస్సు)ను ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు పక్కన ఉన్న రాడ్‌కు వేలాడదీసి ఉరివేసి.. మరోవైపు అతడు కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. 
 
ఆత్మహత్య చేసుకున్న సమయంలో అభయ్ భుతాడ భార్య ఇంట్లో లేదు. పక్కనే ఉన్న తన పుట్టింటికి వెళ్లినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 
 
గోవింద్ పాండురంగ్ ముండాడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలికను హత్య చేసినందుకు మృతుడు అభయ్ లఖన్ భుత్డాపై గాంధీచౌక్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. తదుపరి విచారణను అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఉజాగెరే నిర్వహిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు