ఎనిమిదేళ్లుగా విడిగా ఉంటున్న ఓ జంట విడాకుల కోసం దరఖాస్తు చేస్తూ ఆరు నెలల కూలింగ్ పిరియడ్‌ను సవరించి విడాకులు మంజూరు చేయల్సిందిగా కోర్టును అభ్యర్థించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
భార్యభర్తలు విడిపోతామని నిర్ణయించుకున్నాక, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ జీవించే అవకాశం లేనప్పుడు ఆరు నెలల కూలింగ్ పిరియడ్ నిబంధనను పాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో ట్రయల్ కోర్టులు వారికి వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని సూచన చేసింది.