ఈ కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి అని ఏసీబీ, ఈడీ చార్జిషీట్లు దాఖలు చేయడం తెలిసిందే. అయితే, ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని, ఇది ఎన్నికల సంఘానికి సంబంధించిన విషయం అని పేర్కొంటూ, రేవంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఇదే అంశంపై రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు కాగా, ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు కూడా ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు.