భర్త - తల్లిని కోల్పోయారు... ఒక్క ఆస్పత్రిలోనూ ఒక్క బెడ్ దొరకలేదు..

బుధవారం, 5 మే 2021 (14:24 IST)
ఆమె దూరదర్శన్ మాజీ డైరెక్టర్. పేరు అర్చనా దత్తా. ఆమెను కరోనా వైరస్ తీవ్రంగా శోధించింది. కరోనా వైరస్ సోకి భర్తతో పాటు... తల్లిని కోల్పోయింది. ఆమె కుటుంబంలోని సభ్యుల్లో కుమారుడు మినహా అందరికీ కరోనా వైరస్ సోకింది. ఏ ఒక్కరికీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించలేని దుస్థితి. 
 
ఇది దేశంలో కరోనా వైరస్ విజృంభణకు నిదర్శనం. ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఒక్క పడక కూడా అందుబాటులో లేదు. క‌ళ్ల‌ముందే తమ ప్రాణానికి ప్రాణ‌మైన కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోతున్నారు. ఇక సామాన్యులు, పేద‌లు ఎదుర్కొంటోన్న ప‌రిస్థితులు వ‌ర్ణ‌నాతీతం. 
 
క‌రోనా వేళ అనారోగ్యం పాలైన‌ త‌న‌ తల్లిని, భర్తను తీసుకుని ఎన్నో ఆసుప‌త్రులు తిరిగానని, అయినా ఎక్కడా బెడ్ దొరకలేదని దూరదర్శన్ మాజీ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ అర్చన దత్తా ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేయ‌డం అంద‌రితోనూ క‌న్నీరు పెట్టిస్తోంది.
 
త‌మ‌ కుటుంబానికి ఏమీకాద‌ని త‌న‌లాంటి చాలా మంది ప్ర‌జ‌లు భావిస్తుంటార‌ని, అయితే, త‌న విష‌యంలో మాత్రం విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని ఆమె చెప్పారు. వైద్యం అందకపోవ‌డంతో త‌న‌ తల్లి, భర్త మృతి చెందారని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రులకు వెళ్లినా వారు చేర్చుకోలేదని చెప్పారు.
 
చివ‌ర‌కు త‌న త‌ల్లి, భ‌ర్త‌ను కోల్పోయాన‌ని, మృతిచెందాక వారిద్ద‌రికి క‌రోనా పాజిటివ్‌గా తేలిందని ఆమె వివ‌రించారు. త‌న కుమారుడు అభిషేక్ మిన‌హా మిగిలిన‌ కుటుంబ స‌భ్యులు అంద‌రికీ పాజిటివ్ వ‌చ్చింద‌ని వివరించారు. త‌న మేన‌కోడ‌లి ప‌రిస్థితి క్షీణిస్తోంద‌ని తెలిపారు. ఆక్సిజ‌న్ కోసం తిరుగుతున్నా ఇప్పటికీ దొరకడం లేదన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు