కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు ఏపీ వాసుల దుర్మరణం

ఠాగూర్

శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (15:29 IST)
కర్నాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఏపీ వాసులు మృత్యువాతపడ్డారు. వాహనం వంతెన గోడను బలంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులందరూ హిందూపురానికి చెందిన నాగరాజు, నాగభూషణ్, సోమ, మురళిగా గుర్తించారు. 
 
వీరు హిందూపురం నుంచి కర్నాటకలోని యాద్గిర్ జిల్లా షహర్‌పూర్ వెళుతుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ ఆనంద్ గాయాలతో బయటపడ్డారు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గబ్బూర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు