ఆమె భర్తను ఓ కేసు మీద అరెస్ట్ చేసామని, అతడిని విడిపించుకోవాలంటే తనతోపాటు రావాలని కొత్తగా పెళ్లైన ఆ యువతికి (21) చెప్పాడు. అది నమ్మి వచ్చిన ఆ యువతిని ఆటోలో తీసుకువెళ్లాడు. ఉత్తర ముంబయిలో మలద్‌లో ఉన్న ఓ ఇంట్లో ఎనిమిది రోజులుపాటు బంధించాడు. ఈ దారుణానికి ఓ మహిళతో పాటు నలుగురు సహాయం చేసారు.
బంధించిన ఆమెపై ఇద్దరు వ్యక్తులు పదేపదే అత్యాచారం చేసారు. ఆ తర్వాత మీరా రోడ్డులో నిర్మాణంలో ఉన్న మరో ఇంటికి బదిలీ చేశారు. ఆక్కడ కూడా ఆ వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఇంట్లో ఈ నెల 18 వరకూ బందీగా ఉంచారు. 18వ తేదీన వారు ఆమెను విడిచిపెట్టగానే సరాసరి పోలీసుల వద్దకు వెళ్లింది. జరిగిందంతా వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.