ఈశాన్య రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు.. కొనసాగుతున్న భాజపా హవా

గురువారం, 2 మార్చి 2023 (09:17 IST)
మూడు ఈశాన్య రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. త్రిపుర, మేఘాలయ, నాగాలండ్, మొత్తంగా 180 సీట్లకు ఎన్నికలు నిర్వహించారు. తాజా ఓట్ల లెక్కింపులో నాగాలాండ్‌లో  భాజపా- ఎన్‌డీపీపీ కూటమి హవా కొనసాగుతోంది.  
 
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఈ కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించింది. ప్రస్తుతం భాజపా- ఎన్‌డీపీపీ కూటమి ఒక స్థానంలో విజయం సాధించగా, మరో 48 చోట్ల ఆధిక్యం కొనసాగుతోంది. ఎన్‌పీఎఫ్ 6, కాంగ్రెస్ 1, ఎన్‌పీపీ 3 ఇతరులు ఒక స్థానంలో ముందంజలో వున్నారు. నాగాలాండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 31 స్థానాలు అవసరం 
 
అలాగే త్రిపురలో భాజపా దూకుడు కొనసాగుతోంది. ఆ పార్టీ 38 చోట్ల, కాంగ్రెస్ లెఫ్ట కూటమి 15  స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 
 
మేఘాలయాలో 19 చోట్ల ఎన్‌పీపీ లీడ్‌లో వుంది. మేఘాలయ కన్రాడ్ సంగ్మా నేతృత్వంలో 19 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదు చోట్ల భాజపా ఆధిక్యంలో వుంది. మూడు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. త్రిపురలోని 12 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు