ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మేఘాలయాలో మాత్రం కన్రాడ్ సంగ్మా సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధికారాన్ని చేజిక్కించుకుంటుందని పేర్కొన్నాయి. గురువారం మధ్యాహ్నానికి గెలుపు ఓటములపై స్పష్టత రానుంది.
త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. త్రిపురలో 60, మేఘాలయంలో 60, నాగాలాండ్‌లో 60 స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.