యూపీఏ హయాంలో చిదంబరం కేంద్రమంత్రిగా ఉండగా ఆయన సాయంతో కార్తీ అక్రమంగా విదేశాల నుంచి ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థకు రూ.305 కోట్ల నిధులు రప్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కార్తీపై అభియోగాలు నమోదు చేసి.. సీబీఐ, ఈడీ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.
ఈ కేసులో అరెస్టయిన ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ దేశం దాటి వెళ్లకూడదని షరతు విధించింది. దీంతో గత ఏడాది జనవరి, మే నెలల్లో విదేశీ పర్యటనలకు వెళ్లాలంటూ ఆయన సుప్రీం పర్మిషన్ కోరారు. దీనికి అనుమతిస్తూ కొన్ని షరతలు పెట్టింది న్యాయస్థానం.
రూ.10 కోట్లు లోన్‌గా తీసుకుని కట్టానని, దాని వడ్డీ కడుతున్నానని, ఆ సొమ్ము తిరిగి ఇచ్చేయాలని గత ఏడాదిలో పిటిషన్ వేయగా.. దాన్ని సుప్రీం కోర్టు కొట్టేసింది.