ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి.. పాకిస్థాన్ వెళతా : కర్నాటక మంత్రి (Video)

ఠాగూర్

శనివారం, 3 మే 2025 (09:52 IST)
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఘటనకు ప్రతీకారంగా దాయాది దేశాన్ని గట్టిగా దెబ్బకొట్టాలనే డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కర్నాటక మంత్రి బి.జడ్.జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆత్మాహుతికి బాంబు ఇస్తే పాక్‌పై పోరాటానికి తాను సిద్ధమేనని వ్యాఖ్యానించారు. 
 
'పాకిస్థాన్ ఎప్పటికీ భారత్‌కు శత్రుదేశమే. ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు అంగీకరింస్తే ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు నేను సిద్ధం. ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి' అని ఆయన అన్నారు. అదేసమయంలో పహల్గాం ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది చాలే హేయమైన చర్య అని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. 

 

pic.twitter.com/bUMdCStd5b

— B Z Zameer Ahmed Khan (@BZZameerAhmedK) May 2, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు