శ్రీలంక సందర్శన కోసం 160 మంది భక్తులతో అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాంతి దూత గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

ఐవీఆర్

శుక్రవారం, 24 మే 2024 (17:49 IST)
శ్రీలంకలో తమ ఇటీవలి సందర్శన కోసం ఆధ్యాత్మిక నాయకుడు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్, 160 మంది భక్తులతో కలిసి శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌ను ఎంపిక చేసుకోవటం విశేషం. ప్రపంచంలోని అతిపెద్ద లాభాపేక్షలేని స్వచ్చంద సంస్థలలో ఒకటైన, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఒత్తిడి-లేని, హింస-రహిత, ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన సమాజాన్ని సృష్టించడానికి శ్రీలంకలో చురుకుగా పని చేస్తోంది.
 
గురుదేవ్, అతని భక్తులను UL172లో ప్రయాణించటం కోసం బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ యొక్క ఏరియా మేనేజర్- బెంగుళూరు, ఇరుషికా అల్వీరా, ఎయిర్‌లైన్ యొక్క బెంగుళూరు బృందం స్వాగతం పలికారు. శ్రీలంకన్ ఎయిర్లైన్స్ వారి ప్రయాణం సౌకర్యవంతంగా, ఇబ్బందులు లేకుండా ఉండేలా చూసింది, వారి ప్రయాణంలో అత్యధిక శ్రద్ధ, భద్రతను అందిస్తూనే, వారి నిర్దిష్ట ఆహార ప్రాధాన్యతలకనుగుణంగా పూర్తి శాఖాహార భోజనాలతో వారిని సంతృప్తి పరిచింది. మొత్తం యాత్రను ఆర్ట్ ఆఫ్ లివింగ్ యొక్క అంతర్గత ట్రావెల్ ఏజెన్సీ సుమేరు ట్రావెల్స్ నిర్వహించింది. 
 
కర్నాటక నుండి ప్రత్యేక బృందాలను శ్రీలంకతో అనుసంధానించడానికి శ్రీలంక ఎయిర్‌లైన్స్ కట్టుబడి ఉంది. రెండు దేశాల మధ్య సౌకర్యవంతమైన  విమాన సేవలను నిర్ధారించడానికి సుమేరు ట్రావెల్‌ సహకరిస్తూనే ఉంటుంది. శ్రీలంక- భారతదేశం మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలకు ప్రతీకగా గురుదేవ్ సందర్శన నిలిచింది, రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసింది. 19 మే 2024న తాజ్ సముద్రం వద్ద ‘ఏకముతువ’ పేరుతో జరిగిన  కార్యక్రమంలో గురుదేవ్ బహిరంగ సభలో ప్రసంగించారు. సందర్శనలో భాగంగా, గురుదేవ్ నువారా ఎలియాలోని సీత అమ్మన్ ఆలయంలో జరిగిన ‘కుంబాభిషేకం’ కార్యక్రమంలో పాల్గొని సమాజాన్ని ఆశీర్వదించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు