పానీపూరీ వ్యాపారం చేస్తోన్న మహిళా వైద్యురాలు.. కారణం ఏంటి?

సోమవారం, 27 మార్చి 2023 (09:03 IST)
మహిళా వైద్యురాలు పానీ పూరీ వ్యాపారం చేస్తోంది. తాళం వేసిన ఆస్పత్రి ఎదుటే ఇలా పానీపూరీ వ్యాపారం చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్‌లోని అశోక్ గహ్లోత్ ప్రభుత్వం ఇటీవలే తీసుకువచ్చిన ఆరోగ్య బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. 
 
ఈ క్రమంలోనే డాక్టర్ అనిత ఇలా నిరసన తెలుపుతున్నారు. ఆస్పత్రి బోర్డు కూడా తొలగించి.. అనిత పుచ్కావాలీ అని పానీపూరి దుకాణం బోర్డు పెట్టారు. తన నేమ్‌బోర్డును సైతం మాజీ ప్రైవేట్ డాక్టర్ అని మార్చుకున్నారు. ఇలాగే మరో వైద్యుడు తన ఆస్పత్రిని పరాఠా సెంటర్‌గా మార్చారని ఆమె తెలిపారు. 
 
ప్రైవేట్ ఆస్పత్రుల ఆందోళనల నడుమే రైట్ టు హెల్త్ బిల్లును రాజస్థాన్ సర్కారు ఆమోదించింది. ఈ బిల్లుతో రాష్ట్రంలోని ఏ పౌరుడైనా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఏ ఆస్పత్రిలోనైనా అత్యవసర చికిత్స పొందవచ్చు. ఈ చట్టంపైనే వైద్యులు నిరసన తెలుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు