''మేరా రేషన్" యాప్ విడుదల.. త్వరలో 14 భాషల్లో అందుబాటు

శనివారం, 13 మార్చి 2021 (10:00 IST)
Mera Ration
రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్. రేషన్ లబ్ధిదారుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ను విడుదల చేసింది. మేరా రేషన్ పేరున తీసుకొచ్చిన ఈ యాప్ వలస కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం తెలిపింది. ఈ యాప్ ద్వారా లబ్ధిదారులు దగ్గరలోని రేషన్ దుకాణం పేరు, లభించే సరుకులు, ఇటీవల జరిపిన లావాదేవీలు వంటివీ తెలుసుకునే వీలుంది.
 
అంతేకాకుండా 'వన్ నేషన్ వన్ రేషన్' కార్డు కింద రేషన్ కార్డు పోర్బబులిటీని కూడా చేసుకునే వెసులుబాటు ఉందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణి వ్యవస్థ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుదాన్షు పాండే తెలిపారు.
 
ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ రేషన్‌కార్డు పోర్టబులిటీ విధానం అమల్లో ఉందని తెలిపారు. ఈ యాప్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) రూపొందించిందని తెలిపారు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ బాషల్లో అందుబాటులో ఉండగా.. త్వరలో 14 భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. 'మేరా రేషన్' యాప్‌లో ఆధార్, లేదంటే రేషన్ కార్డు నంబరు ద్వారా లాగిన్ కావొచ్చునని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు