సాధారణంగా ఎన్నారై భర్త అంటే.. ప్రతి ఒక్కరూ ఎగిరి గంతేస్తారు. కానీ, అలాంటి సంబంధాలే లేనిపోని కష్టాలు తెచ్చిపెడుతాయి. తాజాగా ఓ ఎన్నారై భర్త.. కట్టుకున్న భార్యతో సంసారం చేసేందుకు అదనపు కట్నం తేవాలంటూ వేధించాడు. అంతేనా... గత యేడాది కాలంగా భార్యతో శృంగారానికి దూరంగా ఉంటున్నాడు.
ఇక బిడ్డకు, బాధితురాలికి ఆరోగ్యం బాగాలేకపోయినా పట్టించుకునేవాడు కాదు. ఆస్పత్రికి తీసుకెళ్లడం.. మందులిప్పించడం వంటివి చేసేవాడు కాదు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో భర్తతో కలిసి ఇండియాకు వచ్చింది బాధితురాలు. భర్త ఆమెను తన పుట్టింట్లో వదిలేసి దుబాయ్ చెక్కెశాడు. అతడి చేష్టలతో విసిగిపోయిన మహిళ అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేసింది.