మోడీ సీప్లేన్‌ జర్నీ... పొలాల్లో పురుగుమందులు చల్లుకోవచ్చట (వీడియో)

మంగళవారం, 12 డిశెంబరు 2017 (16:57 IST)
ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా సముద్ర విమానం (సీప్లేన్)లో ప్రయాణించారు. గుజరాత్ రెండో విడత ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో రోడ్‌షో నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అయితే శాంతిభద్రతల దృష్ట్యా మోడీ రోడ్‌షోకు అహ్మదాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో మోడీ సబర్మతీ నది నుంచి ధారోయ్ డ్యామ్ వరకు మోడీ సీప్లేన్‌లో ప్రయాణించారు. 
 
దీంతో గుజరాత్ మొత్తం ఇపుడు మోడీ ప్రయాణించిన సీప్లేన్‌పైనే రసవత్తర చర్చసాగుతోంది. అలాగే, నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో తమకుతోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. రాష్ట్రానికో విమానాశ్రయం మాత్రమే ఉన్న దేశంలో.. విమానయానం అనేది సామాన్యులకు అందనంత దూరంగా ఉందనీ, ఇలాంటి సమయంలో సీప్లేన్ వల్ల ఉపయోగం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. 
 
అహ్మదాబాద్‌లోని సబర్మతి నదిలో మోడీ ప్రయాణించిన సీప్లేన్‌తో పొలాల్లో రైతులు పురుగు మందులు చల్లుకోవాలా? అంటూ పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అభివృద్ధిని సీప్లేన్‌తో పోల్చటం సరికాదన్నారు. 
 
శ్రీలంక కూడా ఎంతో అభివృద్ధి చెందిందని.. రావణుడి అహంకారంతో ఆ రాజ్యం బూడిద అయ్యిందంటూ మోడీ వైఖరిని పోల్చారు. అనేక దేశాల్లో సీప్లేన్‌లు సర్వసాధారణం అని.. ఎప్పుడో వచ్చాయని గుర్తు చేశారు. పైగా, బీజేపీ ప్రభుత్వానికి మిడిసిపాటు ఎక్కువైందంటూ చురకలు అంటించారు. 

 

#WATCH Prime Minister Narendra Modi waves to the crowd from a #seaplane at Ahmedabad's Sabarmati Riverfront #GujaratElection2017 pic.twitter.com/JkxdZg0Y9X

— ANI (@ANI) December 12, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు