కోడలితో మామ పారిపోయాడు.. అవమానంతో తలదించుకున్న భర్త

మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (11:41 IST)
కోడలితో మామ పరారైన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. కోడలితో మామ పారిపోవడంతో కుటుంబీకులు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని పనిపాత్ సోని కాలనీకి చెందిన అసామా.. అనే మహిళ మామగారితో ఇంటి నుంచి పారిపోయింది. అసమాతో పాటు అబ్ధుల్ అనే వ్యక్తితో నాలుగేళ్ల క్రితం వివాహం అయ్యింది. ఈ దంపతులకు పదినెలల కుమార్తె, 10 ఏళ్ల కుమారుడు వున్నారు. 
 
ఈ దంపతులు అత్తమామగారితో ఒకే ఇంట్లో వున్నారు. ఈ నేపథ్యంలో తన కుటుంబ సభ్యులకు ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చి.. వారు స్పృహ కోల్పోయాక, మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో మామగారైన సలీంతో కోడలు ఇంటి నుంచి పారిపోయింది. అసామా తన కుమార్తెతో కలిసి మామగారితో పారిపోవడం చర్చనీయాంశమైంది. 
 
ఇంకా సలీమ్ కోసం వేచి వుంటున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదైనాయి. ఈ వ్యవహారం తెలియక సలీమ్ కుటుంబీకులు ఎక్కడెక్కడో వెతికారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జరిపిన విచారణలో మామగారితో కోడలు పరారైనట్లు తేలింది. దీంతో సలీమ్ కుటుంబీకులు షాకయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు